ఏపీ రాజకీయాల్లోకి వస్తా || KCR Strong Punches On Chandrababu After Winni...
తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు అంటుంటాడని, తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్‌కు ఉండొద్దా? అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని వంద శాతం కోరుకుంటున్నానని, తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే కలిసి పని చేయాలన్నారు. బర్త్‌డే పార్టీ చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఇచ్చిన గిఫ్ట్‌కు.. తాను కూడా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే బాగుండదని చమత్కరించారు. చంద్రబాబు ఇక్కడ చేసినందుకు తాను అక్కడ చేయాలి కదా.. దాని ఫలితం ఎలా ఉండబోతుందో చంద్రబాబు త్వరలో చూస్తారని అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తెలంగాణోళ్లు సంస్కారహీనులు అని మళ్లీ అంటారు అని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబుకు పైత్యం ఉందని, గతంలో మోడీని అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Post a Comment